జగన్‌ కు షాక్‌.. ఉండవల్లితో బ్రదర్ అనిల్ భేటీ !

-

తూర్పుగోదావరి జిల్లా : అంతర్జాతీయ సువార్తకులు బ్రదర్ అనిల్ ఇవాళ మాజీ ఎం.పి. ఉండవల్లి అరుణ్ కుమార్ ను కలిశారు. ఈ సందర్భంగా బ్రదర్‌ అనిల్‌ మాట్లాడుతూ… తమ సమావేశం మర్యాద పూర్వకంగానే జరిగిందన్నారు. సుమారు గంట సేపు సుదీర్ఘ చర్చలు చేశామని తెలిపారు బ్రదర్‌ అనిల్. తెలంగాణ, ఆంధ్రా కు సంబంధించిన రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయని.. పార్టీ పరంగా, కుటుంబ పరంగా ఉండవల్లి సలహాలు ఇచ్చారని తెలిపారు.

రాజకీయ జ్ఞానం నేర్చుకోవటం కోసమే ఉండవల్లి దగ్గరకు వచ్చానని.. ఉండవల్లి జ్ఞానం నచ్చిందని వెల్లడించారు. ప్రజలకు మంచి చేయడమే నిజమైన రాజకీయమని.. నేను ప్రభువును నమ్ముకున్నాను, దేవుడు చెప్పితే కానీ ఏది చేయనని స్పస్టం చేశారు.

తమ కుటుంబం ఎప్పుడో రాజకీయాల్లో ఉందని… రాజకీయం అనేది పెద్ద వ్యవస్థ అని తెలిపారు. విభజన కథ బుక్ ను తన ఉండవల్లి అరుణ్ కుమార్ ఇచ్చారని వివరించారు. ఉండవల్లితో బేటికి సంబంధించిన విషయాలు త్వరలో బయటపెడతామని.. కుటుంబానికి, రాజకీయాలకు సంబంధించిన రహస్య విషయాలు చర్చకు వచ్చాయన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version