పెద్ద హీరోలకు చిన్న కథ ఉంటే చాలు. కానీ చిన్న హీరోలకు పెద్ద కథే కావాలి. ఆ లెక్కన చూసుకుంటే రానా స్థాయిని పెంచేందుకు లేదా రానా ఇమేజ్ గ్రాఫ్ ను పెంచేందుకు భీమ్లా నాయక్ ఉపయోగపడుతుంది. అంటే కథే హీరో అని అనుకుని తెరకెక్కే సినిమా లకు కొంత కాలం వరకూ రానా కేరాఫ్ అయ్యాడు. కథతో పాటు హీరో ఇమేజ్ ఇంకొంత తోడుగా ఉంటే ఎలా ఉంటుందో అన్న అంచనాలు కూడా కొంత కాలం రుజువు చేశాడు. ఇప్పుడు హాయిగా మల్టీ స్టారర్ సినిమాలతో కూడా తన స్థాయిని ఏ మాత్రం తగ్గించుకోకుండా మంచి హిట్లు కొట్టవచ్చని నిరూపించాడు.
హీరో రానా ఇక ఫిక్స్ అయిపోవచ్చు. వరుస మల్టీ స్టారర్ సినిమాలు ఒప్పుకునేందుకు.. ఆయన పవన్ తో పోటీ పడుతూ చేసిన సినిమా ఇది. ఇకపై కూడా ఈ మానియా కొనసాగించవచ్చు. ఏదేమయినప్పటికీ పవన్ కన్నా రానా, రానా కన్నా పవన్ ఒకరినొకరు బాగానే నిరూపించుకునే ప్రయత్నం అయితే చేశారు.ఆ ప్రయత్నంలోభాగంగా సినిమా రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.
వరుస మల్టీ స్టారర్ సినిమాలతో దూసుకుపోతున్న రానాకు భీమ్లా నాయక్ అన్నది బిగ్ బ్రేక్. ఈ సినిమా తరువాత ఆయన ఫేట్ పూర్తిగా మారిపోనుంది. కమర్షియల్ ఫ్రేమ్స్ లో మరో స్థాయిలో కనిపించనున్నాడు. ఇంతవరకూ చేసిన సినిమాలకూ ఈ సినిమాకూ అస్సలు పోలిక ఉండదు.బాహుబలి తరువాత ఆయన స్థాయిని మరింత పెంచేందుకు సాయం చేసే సినిమా ఇదే!