“భీమ్లా నాయక్” సినిమా ఇవాళ విడుదల అయిన నేపథ్యంలో.. ఏపీ సర్కార్ థియేటర్లపై ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ వ్యవహరంపై తాజాగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు.
“భీమ్లా నాయక్”పై ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నారని జగన్ పై మండిపడ్డారు చంద్రబాబు. “రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ సిఎం జగన్ వదలడం లేదు. చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నాడు. భీమ్లానాయక్ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తుంది” అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు అన్నీ పక్కన పెట్టి…థియేటర్ల దగ్గర రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టిన ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకరమని ఆగ్రహించారు.
ఉక్రెయిన్ లో చిక్కుకున్న తమ వారిని రక్షించేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేస్తుంటే… ఆంధ్ర ప్రదేశ్ సిఎం మాత్రం భీమ్లా నాయక్ పై కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు దేశం తప్పును ఎప్పుడూ ప్రశ్నిస్తుంది…నిలదీస్తుంది. భీమ్లా నాయక్ విషయంలో వేధింపులు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు చంద్రబాబు.
రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు అన్నీ పక్కన పెట్టి…థియేటర్ల దగ్గర రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టిన ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకరం. #Ukraine లో చిక్కుకున్న తమ వారిని రక్షించేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేస్తుంటే…(3/4)
— N Chandrababu Naidu (@ncbn) February 25, 2022