టేస్టీ బ్రౌన్ రైస్ కిచిడీ..!

-

మనం ఎంతో ఈజీగా బ్రౌన్ రైస్ తో రెసిపీస్ ని తయారు చేసుకోవచ్చు. అయితే ఈ రోజు బ్రౌన్ రైస్ కిచిడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బ్రౌన్ రైస్ వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. పైగా రుచిగా బ్రౌన్ కిచిడీ తయారు చేసుకోవడం వల్ల ఎవరైనా ఇంట్రెస్టింగ్ గా తింటారు. ఎవరికైనా సరే దాని రుచి నచ్చుతుంది.

బ్రౌన్ రైస్ కిచిడీకి కావలసిన పదార్ధాలు:

బ్రౌన్ రైస్ అర కప్పు
ఒక కప్పు పెసరపప్పు
2 టేబుల్ స్పూన్లు నెయ్యి
ఒక టీస్పూన్ జీలకర్ర
అర టీ స్పూన్ ఇంగువ
అర టీ స్పూన్ పసుపు
రెండు లవంగాలు
3 నల్ల మిరియాలు
ఉప్పు రుచికి సరిపడా

బ్రౌన్ రైస్ కిచిడీ తయారు చేసే పద్ధతి:

దీని కోసం ముందుగా బ్రౌన్ రైస్ లో పెసరపప్పు వేసి కాసేపు నానబెట్టాలి. ఆ తర్వాత ఆ నీటిని తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి జీలకర్ర, ఇంగువ, పసుపు, లవంగాలు, మిరియాలు వేసి లో ఫ్లేమ్ మీద వేయించాలి.

ఆ తర్వాత బియ్యం, పెసరపప్పు కూడా వేసి మూడు కప్పుల నీళ్ళు వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని నాలుగు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉంచాలి. పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముప్పావు కప్పు నీళ్ళు పోసి బాగా మిక్స్ చేసి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version