కాంగ్రెస్ యాడ్స్ పై ఈసీ కి బీఆర్ఎస్ ఫిర్యాదు..!

-

టీవీ యాడ్స్ పేరుతో కాంగ్రెస్ ఎన్నికల కోడ్ అతిక్రమిస్తోందని బీఆర్ఎస్ లీగల్ టీమ్ సోమా భరత్ ఆరోపించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ టీవీ ప్రకటనలపై ఈసీకి ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు. ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండానే అనుమతి ఉన్నట్టుగా మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని.. ఈ విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని.. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. ఈ వ్యవహారంపై స్పందించిన ఈసీ సాయంత్రం వరకు ఈసీ ఆర్డర్స్ ఇస్తామని చెప్పినట్టు తెలిపారు.

అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన స్టార్ క్యాంపెయినర్స్ భాష పద్దతి సరిగ్గా ఉండాలని ఈసీ సూచించిందని సోమా భరత్ తెలిపారు. మరోవైపు సోషల్ మీడియా ఫ్లాట్ లో ఏ సైట్ ఓపెన్ చేసిన కేసీఆర్ ఫొటో ప్రత్యక్ష్యం అయ్యేలా ప్రకటనలు వస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకే ఓటు వేయాలంటూ ట్రూకాలర్, వాట్సాప్ లలో రిక్వెస్టులు వస్తుండగా.. యూట్యూబ్ లో చూసే సినిమాల్లోనూ బీఆర్ఎస్ కి అనుకూలంగా ప్రకటనలు వస్తున్నాయని ఈ యాడ్లపై విమర్శలు వక్తమవుతున్నాయి. ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ ప్రచార ప్రకటనలపై బీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news