బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల బాధను పట్టించుకోలేదు : ప్రియాంక గాంధీ

-

రాష్ట్ర ఏర్పాటు కోసం ఇక్కడి ప్రజలు ఎంతో పోరాటం చేసినట్టు తన తల్లి సోనియాగాంధీ చెప్పారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తెలిపారు. బలమైన ప్రభుత్వం ఏర్పడి ఉంటే.. తెలంగాణ ప్రజల కలలు నెరవేరేవి అని ఆమె నాతో అన్నారు. హామీలు ఇవ్వడమే కాదు.. వాటిని నెరవేర్చడం కూడా ముఖ్యమని చెప్పారు. అందుకే మేము ఇస్తున్న గ్యారెంటీలన్నీ కచ్చితంగా అమలు చేస్తామని మధిర సభలో ప్రియాంక వెల్లడించారు. ఎన్నికల సమయంలో బాగా ఆలోచించండి.. పది సంవత్సరాలుగా మీరు ఎదుర్కొన్న సమస్యల గురించి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటు వేయండి అని సూచించారు.

కాంగ్రెస్ పార్టీని గెలిస్తే.. మీ సమస్యలన్నీ పరిష్కారం చేసుకునేటట్టుగా గొప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి. ధాన్యం పండించే రైతులందరికీ ప్రతీ క్వింటాల్ కి రూ.500 బోనస్ గా ఇస్తామని.. నా సోదరీ మణులు పెరిగిన ధరలతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసమే అకౌంట్ లో ప్రతీ నెల రూ.2500 అకౌంట్లో వేస్తామని తెలిపారు. అందరికీ రూ.500 కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news