తెలంగాణాలో నవంబర్ 30న జరగబోయే ఎన్నికలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో కేసీఆర్ వరుసగా మూడవసారి గెలిచి హ్యాట్రిక్ సీఎంగా పేరు తెచ్చుకోవాలని కసితో పనిచేస్తున్నారు. ఆ తరువాత కాంగ్రెస్ సైతం వైఎస్సార్ మరణాంతరం అధికారంలోకి రావడానికి ఎన్నో మార్పులను చేసుకుని ఎన్నికలకు వెళుతోంది. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ మీకు ప్రత్యేక తెలంగాణను అందించడంలో సోనియా గాంధీ మనసు ఏమిటో తెలుసుకున్నారు. ఇప్పుడు మరొక్క సారి కాంగ్రెస్ కు అధికారాన్ని అందించి పాలన ఎలా ఉంటుందో చూడాలంటూ ప్రజలను కోరారు ప్రియాంక గాంధీ. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను తూచా తప్పకుండా నెరవేర్చే బాధ్యతను తీసుకుంటామని ప్రజలకు మాటిచ్చింది ప్రియాంక గాంధీ.
ప్రజల్లో చాలా వరకు కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టాలని మనసులో ఉన్నట్లు స్పష్టంగా అర్ధమవుతోంది.. కానీ కేసీఆర్ పథకాలు కూడా మరోవైపు వెనక్కు లాగుతున్నాయి.