బీసీ రిజర్వేషన్ల బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని మాజీ మంత్రి, ఆ పార్టీ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు స్తానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఫలాలు అందినప్పుడే బీసీలు సంతోషిస్తారని అన్నారు. ఈ అంశం పై శాసనసభలో ఏకగ్రీవ తీర్మాణానికి, పార్లమెంట్ లో పోరాటానికి బీఆర్ఎస్ కలిసి వస్తుందన్నారు.
బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతూ ఓటు వేస్తామని చెప్పారు. బిల్లు పై రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఒత్తిడి తీసుకురావాలని హరీశ్ రావు కోరారు. అదేవిధంగా మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు పార్లమెంట్ లో కొట్లాడటానికి బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపారు హరీశ్ రావు. ఇందుకు బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు కూడా సహకరించాలని కోరారు.