తెలంగాణ ప్రజల హక్కులను కాపాడేందుకే బీఆర్ఎస్ పుట్టింది : సీఎం కేసీఆర్

-

బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కులను కాపాడేందుకు అని సీఎం కేసీఆర్ వెల్లడించారు. నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. ప్ర‌జల ఆకాంక్ష‌లు నెర‌వేర్చే పార్టీ గెల‌వాలి.. అప్పుడే ప్ర‌జ‌ల కోరిక‌లు తీరుతాయి.. అందుకే ఆలోచించి ఓటేయాలి అని సీఎం కేసీఆర్ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ పుట్టిందే ప్ర‌జ‌ల కోసం, హ‌క్కుల కోసం, నీళ్లు, నిధులు, నియామ‌కాల కోసం అని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఎట్టి ప‌రిస్థితుల్లో న‌ష్టం రాకుండా ఉండాల‌ని ఆలోచించే కాపల‌దారే బీఆర్ఎస్. ప్ర‌జ‌ల హ‌క్కుల కోసం 15 ఏండ్లు నిర్విరామంగా పోరాడి, చివ‌ర‌కు చావు నోట్లో త‌ల‌కాయ‌పెట్టి సాధించుకున్నాం. రెండు సార్లు బీఆర్ఎస్‌ను ఆశీర్వ‌దించారు. తెలంగాణ రాక‌పోతే నిర్మ‌ల్ జిల్లా అయ్యేదా..? ఇవ‌న్నీ ఆలోచించాలి. నిర్మ‌ల్ జిల్లాను చేయించింది ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డినే.

ఆదిలాబాద్ జిల్లాలో ఏం చేద్దాం ఎన్ని జిల్లాలు చేద్దామ‌ని ఆలోచించాం. ఆదిలాబాద్‌తో పాటు మంచిర్యాల చేయాల‌ని నిర్ణ‌యించాం. ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మ‌ళ్లీ గంట త‌ర్వాత వ‌చ్చారు. బాస‌ర నుంచి ఆదిలాబాద్, బెజ్జూరు నుంచి ఆదిలాబాద్ రావాలంటే చాలా స‌మ‌యం ప‌డుత‌ది. కాబ‌ట్టి నాలుగు జిల్లాలు చేయాల‌ని అడిగారు. నిర్మ‌ల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలు కావాల‌ని గంట‌సేపు వాదించారు. ఈ నాలుగు జిల్లాలు చేసిందే ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డినే. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా ప్ర‌జ‌లు చేయెత్తి దండం పెడుతున్నారు. నాలుగు మెడిక‌ల్ కాలేజీలు వ‌చ్చాయి. ఇవాళ ఇంజినీరింగ్ కాలేజీ కావాల‌ని అడిగారు. త‌ను పుట్టిన ప్రాంతం మీద ప్రేమ ఉంది కాబ‌ట్టి.. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి అడుగుతున్నాడు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news