కాంగ్రెస్ హయాంలో మార్పు అంటే కరెంట్ కోతలు, రైతులు ఆత్మహత్యలు: BRS నేత

-

కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఘాటు విమర్శలు చేయడం జరిగింది. తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన ప్రెస్మీట్లో ఈయన మాట్లాడారు అబద్ధాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ వచ్చింది కరువు తీసుకువచ్చిందని కాంగ్రెస్ హయాంలో మార్పు అంటే కరెంటు కోతలు రైతుల ఆత్మహత్యలు అని అన్నారు. 100 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్టని కాంగ్రెస్ దెబ్బతిస్తుందని ఉస్మానియా యూనివర్సిటీకి కరెంటు నీళ్లు ఇవ్వలేము.

విద్యార్థులు ఖాళీ చేయాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని అన్నారు. కేసీఆర్ స్పందించిన తర్వాత ప్రభుత్వం చీఫ్ వార్డెన్ కి షోకాజు నోటీసులు ఇచ్చిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాదిగ మంత్రి లేడని ఎంపీ టికెట్ ఇవ్వరన్నారు. మాదిగలని కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగు తాగునీరు లేని పరిస్థితి వచ్చిందని అన్నారు ఖాళీ బిందెలతో మహిళలు రోడ్లు ఎక్కుతున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version