కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి చుక్కలు చూపిస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట ఆర్టీవో కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు దీక్ష చేపట్టారు. ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కుంటి సాకులు చెప్పి రైతులకి సాగునీరు విద్యుత్ ఇవ్వడం లేదని చెప్పారు. కాలేశ్వరం ప్రాజెక్టులో 3 పిల్లర్లలో ఒకటో రెండో పిల్లర్లు కుంగిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సింది పోయి సాగునీరు అందించకుండా పొలాలని ఎండ కొడుతుందని ఎండ కడుతుందని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలైన ధాన్యాన్ని 500 బోనస్ రైతుబంధు ఇవ్వట్లేదని ఆరోపించారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ సాగునీరు కరెంటు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని చెప్పారు కాంగ్రెస్ వంద రోజులు పాలనలో ఇన్వర్టర్ కన్వర్టర్లు తిరిగి వచ్చాయని అన్నారు కాలేశ్వరం ప్రాజెక్టు సద్వినియోగపరచుకోవాలని ఈ కారణంగా రైతాంగం దిక్కుతోచని స్థితిలో పడిందని అన్నారు.