బీఆర్ఎస్ ని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన వాళ్లకి బుద్ధి చెప్పాలని పోయేటప్పుడు పోతాడు కానీ మేము పార్టీలోనే ఉంటామని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన రంజిత్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి నాయకుడు కష్టాల్లో ఉన్న టైంలో పార్టీని విడిచి వెళ్లడం మంచి పద్ధతి కాదని కష్టాల్లో ఉన్నప్పుడు నాయకుడు వెంట ఉండాలని ఆయన మనల్ని నమ్ముకుని ఉన్నప్పుడు మనం కూడా ఆయనని నమ్ముకుని పోరాడాలని సూచించారు. రంజిత్ రెడ్డి పోయినందుకు ఎవరు ఆలోచించరని ఆయన పోతే ఇంకొకరు వస్తారని గుర్తుంచుకోవాలని అన్నారు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు విడిచిన వెళ్లిన వాళ్లకి బీఆర్ఎస్ కార్యకర్తలు బుద్ధి చెప్పాలని అన్నారు.