సీఎం రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం కేబినెట్ భేటీ అనంతరం ఎన్నికల హామీల్లో భాగంగా అన్నదాతలకు అందించే ఆర్థిక సాయం రైతుభరోసాపై కీలక ప్రకటన చసిన విషయం తెలిసిందే. రైతులకు ఎకరాకు రూ.7,500 రైతు భరోసా ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కి రూ.6 వేలు ఇస్తామని ప్రకటించింది. దీనిపై బీఆర్ఎస్ నేతలు పరోక్షంగా పోస్టర్ వార్ నిర్వహించారు.
‘ఎగ్గొట్టిన రైతు భరోసా ఎప్పుడు వేస్తావ్ రేవంత్..మీరు 2023 యాసంగి ఎకరానికి రూ.2,500లు, 2024 వానకాలం ఎకరానికి 7,500లు, యాసంగి ఎకరానికి రూ.7,500 మొత్తం రూ.17,500 రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఎకరానికి బాకీ పడిందని రాసిన పోస్టర్లను బీఆర్ఎస్ నగరంలోని పలుచోట్ల అతికించింది. అలాగే, మరో పోస్టర్‌లో రేవంత్..రైతు భరోసా కింద అన్నదాతలకు ఒక్కో ఎకరానికి ప్రభుత్వం బాకీ పడ్డది..ఒక ఎకరానికి 17,500 మెుదలు 7 ఎకరాలకు 1 లక్ష 22,550లు బాకీ అని పేర్కొన్నారు. రైతు భరోసాపై సీఎం రేవంత్ మోసం చేశారని పోస్లర్ల ద్వారా బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నది