ఏపీ : అక్టోబర్ నుండి బీటెక్, డిగ్రీ విద్యార్థులకు క్లాసులు..50% కాలేజీకి, 50% ఆన్లైన్..!

యూనివర్సిటిలు డిగ్రీ,బీటెక్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభిస్తున్నట్లు ఏపి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం బీటెక్, డిగ్రీ క్లాసులకు సంబంధించి క్యాలెండరు ను కూడా విడుదల చేసింది. ప్రతి వారం ఆరు రోజులు క్లాసులు జరుగుతాయి. ఏదైనా రోజున క్లాసులు జరగకపోతే ఆ క్లాసును ఆదివారం లేదా రెండో శనివారం నిర్వహించాలని పేరొంది.

ఈ క్యాలెండరు ప్రకారం ఆగస్ట్ 9 నుండి అన్ని కోర్సులకు క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉంటే 50 విద్యార్థులకు నేరుగా క్లాసులు ఉండగా…50 శాతం మందికి ఆన్లైన్ లో క్లాసులకు నిర్వహిస్తారు. మళ్ళీ మూడు నెలల తర్వాత ఎక్స్ చేంజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే రాష్ట్రం లో స్కూళ్లు, ఇంటర్ కాలేజీలు తెరిచిన సంగతి తెలిసిందే. దాంతో పాఠశాలల్లో హాజరు శాతం కూడా పెరిగింది.