అప్పులు తీర్చలేక బీటెక్ విద్యార్థి బలవన్మరణం

-

‘తెలిసీ తెలియక అప్పులు చేశా… వాటిని తీర్చేలేకపోతున్నా.. చాలా అబద్ధాలు చెప్పా.. నా మాటలన్నీ నాటకమే.. దయచేసి అర్థం చేసుకోండి.. అమ్మా, నాన్న, గుడి, తమ్ముళ్లు జాగ్రత్త’ అంటూ ఇంజినీరింగ్‌ పట్టభద్రుడు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.

గోపాలపురం సీఐ సాయి ఈశ్వర్‌గౌడ్‌ వివరాల ప్రకారం.. వరంగల్‌ కాశీబుగ్గకు చెందిన మామిడి లక్ష్మిసాయి(22) బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇంటర్వ్యూ ఉందని గతనెల 31న నగరానికి వచ్చాడు. గురుద్వారా ప్రాంతంలోని లోటస్‌ గ్రాండ్‌ హోటల్‌లో దిగాడు. రెండురోజుల నుంచి కనిపించలేదు. అద్దె చెల్లించకపోవడంతో గురువారం రూమ్‌ బాయ్‌ శ్యామ్‌ తలుపు కొట్టాడు. లక్ష్మీసాయి స్పందించకపోవడంతో హోటల్‌ యజమానికి చెప్పగా.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

గది తలుపులు బద్ధలుకొట్టి చూడగా బాత్‌రూమ్‌లో బైండింగ్‌ వైర్‌తో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. అతని వద్ద సూసైడ్‌ నోటు లభ్యమైంది. సోమవారం రాత్రి చివరి ఫోన్‌కాల్‌ ఉండటంతో అదేరోజు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చునని భావిస్తున్నారు. సూసైడ్‌నోట్‌ ఆధారంగా అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version