బడ్జెట్ ప్రతిపాదనల కోసం సమీక్ష సమావేశం మొదలైంది. రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖల సమీక్ష ని మొదలు పెట్టారు. వివరాలు చూస్తే.. డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అలానే బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లు ఉన్నతాధికారుల తో సమావేశం అయ్యారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బడ్జెట్ ప్రతిపాదనలపై రవాణా ఆర్టీసీ ఉన్నత అధికారులు వివరించడం జరిగింది.
రవాణా శాఖ లో వస్తున్న ఆదాయం వ్యయాలు కేటాయింపులు వంటి వాటి గురించి చర్చించారు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పాలసీలు అలానే తదితర అంశాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ఇది ఇలా ఉంటే శాఖ కి గతం లో కేటాయించిన బడ్జెట్ కొత్త స్కీముల అమలు నేపథ్యంలో ఈసారి పెంచాలని ఈ విషయాలు గురించి మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.