ఈ మధ్య కాలంలో బాంబు బెదిరింపు కాల్స్, బుల్లెట్లు దర్శనం ఇవ్వడం సంచలనంగా మారింది. ప్రధానంగా ఎక్కువగా బాంబు బెదిరింపు కాల్స్ ఒక్క మే నెలలోనే దేశవ్యాప్తంగా 50కి పైగా చోటు చేసుకోవడం గమనార్హం. బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, విమానాశ్రాయం, క్రీడా మైదానం ఇలా పలు చోట్ల బాంబు ఉన్నట్టు బెదిరింపు కాల్స్ విపరీతంగా వస్తున్నాయి. మొన్నటికి మొన్న తెలంగాణలోని ప్రజాభవన్ లో, నాంపల్లి కోర్టు ఆవరణలో బాంబు ఉన్నట్టు ఫేక్ కాల్ చేసిన విషయం తెలిసిందే.
ఇలా నిత్యం ఎక్కడో ఒక చోట ఏదో ఒక సంఘటన దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటూనే ఉంది. తాజాగాబ చెన్నై విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం సృష్టించింది. సినీ నటుడు, మాజీ ఎమ్మెల్యే కరుణాస్ హ్యాండ్ బ్యాగ్‌లో 40 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ అధికారులు. దీనిపై విచారణ కొనసాగుతోంది. తన బ్యాగ్ లోకి పొరపాటున బుల్లెట్లు వచ్చినట్టు వివరణ ఇచ్చారు కరుణాస్. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరీ.