Sunny Leone: వీరాభిమాని వినూత్న ఆలోచన..సన్నీలియోన్ అభిమానులకు బంపర్ ఆఫర్..ఎక్కడంటే?

-

సినీ నటులకు ఉండే అభిమానుల గురించి అందరికీ తెలుసు. వారి హీరోలు, హీరోయిన్స్ కాని నటించిన పిక్చర్స్ రిలీజ్ అయితే వారు చేసే సందడి అంతా ఇంతా కాదు. తమ అభిమానం చూపించాలని అనుకుంటుంటారు. ఈ క్రమంలోనే వినూత్నమైన ఆలోచనలు చేస్తుంటారు ఫ్యాన్స్. తమ షాపులకు లేదా ఇతర సంస్థలకు తమ అభిమాన హీరోల పేర్లు పెడుతుంటారు. లేదా తమ అభిమాన తారల పేర్ల మీద దాన ధర్మాలు చేస్తుంటారు. కాగా, బాలీవుడ్ స్టన్నింగ్ బ్యూటీ సన్నీలియోన్ మీద అభిమానాన్ని వినూత్నంగా ప్రదర్శించాడు ఓ అభిమాని.

తమ అభిమాన తారలను కలవాలని అభిమానులు అనుకుంటారు. కాగా, తాజాగా ఓ అభిమాని తన ఫేవరెట్ హీరోయిన్ అయిన సన్నీలియోన్ పేరు మీద సన్నీలియోన్ అభిమానులకు బంపర్ ఆఫర్ ప్రకటించేశాడు. ఇంతకీ ఆ ఆపర్ ఏమిటంటే..తనకున్న చికెన్ షాపులో పది శాతం డిస్కౌంట్ ప్రకటించాడు. దాంతో సన్నీలియోన్ అభిమానులు ఆ షాపు వద్దకు పెద్ద ఎత్తున వచ్చేశారు.

అభిమాని చేసిన ఈ పని కొంచెం వినూత్నంగా ఉంది. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. తన చికెన్ షాపులో సన్నీలియోన్ ఫ్యాన్స్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తానని ప్రకటించిన కర్నాటకలోని మాండ్యాకు చెందిన ప్రసాద్..అందుకు కొన్ని కండీషన్స్ పెట్టాడు. సన్నీలియోన్ ఫ్యాన్స్ అని చెప్పుకునే వారందరూ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో సన్నీలియోన్ అకౌంట్స్ ఫాలో కావాలన్నాడు.

వారి ఫోన్లలో సన్నీలియోన్ ఫొటోలు సేవ్ చేసుకోవాలని, సన్నీ ఫొటోలకు లైక్స్ కొట్టాలని, కామెంట్స్ చేయాలని సూచించారు. ఈ మూడు కండీషన్స్ ఫాలో అయిన వారికి మాత్రమే తమ షాపులో ఏడాది పొడవునా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందని స్పష్టం చేశాడు. తనకు వచ్చిన ఆదాయంలో కొంత అనాథలకు ఇచ్చి వారికి తల్లిగా మారిన సన్నీలియోన్ ఆదర్శ నటి అని పేర్కొన్నారు సదరు అభిమాని.

Read more RELATED
Recommended to you

Latest news