కర్ణాటకలో కరోనా కొత్త వేరియంట్ ని కనుక్కున్నారు. నాలుగు నెలల క్రితం కలెక్ట్ చేసిన శాంపిల్స్ లో ఈటా వేరియంట్ బయటపడింది. మంగళూరుకి చెందిన ఒకానొక వ్యక్తిలో ఈ వేరియంట్ కనిపించింది. ఆ వ్యక్తి అంతకుముందు ఖతార్ నుండి ఇండియాకి వచ్చినట్టు సమాచారం. ఈ మేరకు కర్టాటక పత్రికలు ప్రకటించాయి. ఐతే ఈటా వేరియంట్ బయటకి రావడం ఇదే మొదటిసారి కాదని, నిమ్హన్స్ ల్యాబ్ లో ఏప్రిల్ నెలలోనే గుర్తించారని రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ వి రవి వెల్లడి చేసారు.
అమెరికాకి చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రివెన్షన్ ప్రకారం ఈటా వేరియంట్ ని యునైటెడ్ కింగ్ డమ్ లో కనిపెట్టారు. గత ఏడాది డిసెంబరులో ఈ వేరియంట్ ని గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈటా వేరియంట్, వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా గుర్తించబడింది. అందువల్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.