ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ బిజినెస్ ని స్టార్ట్ చేయాలని చూస్తున్నారు మీరు కూడా ఏదైనా బిజినెస్ కోసం చూస్తున్నట్లయితే ఈ చిట్కాని పాటించండి. ఈ ఐడియాని మీరు ఫాలో అయితే మంచిగా డబ్బులు వస్తాయి ఎటువంటి రిస్క్ కూడా ఉండదు. అదే నల్ల బియ్యం బిసినెస్. నల్లబియ్యం ద్వారా మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. లక్షల్లో లాభాలు వస్తాయి.
రైతుల కష్టాలని నల్లబియ్యం తీరుస్తోంది. అందుకే నల్ల బియ్యం ని పండిస్తున్నారు. రైతులకు చక్కటి లాభాలు వస్తున్నాయి డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి చాలామంది రైతులు వీటిని పండిస్తున్నారు. నల్లబియ్యాన్ని పండిస్తే భారీగా లాభాలు వస్తాయి. నల్ల బియ్యం లో పోషక పదార్థాలు కూడా సమృద్ధిగా ఉంటాయి ఔషధ గుణాలు కూడా ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది తినేందుకు ఇష్టపడుతున్నారు.డయాబెటిస్ బీపీ సమస్యతో బాధపడే వాళ్లకైతే ఇంకా మంచి చేస్తుంది. షుగర్ బిపి వంటివి ఈ బియ్యం తినడం వలన కంట్రోల్లో ఉంటాయి. ధర ఎక్కువైనా సరే ఆరోగ్యానికి మంచిదని చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. మొట్టమొదట చైనాలో ఈ బియ్యాన్ని పండించడం మొదలుపెట్టారు తర్వాత మన దేశంలో చాలా చోట్ల ఈ బియ్యాన్ని పండిస్తున్నారు రైతులు.
ఈ బియ్యం చూడడానికి నల్లగా వున్నా వీటిని వండుకున్న తర్వాత అన్నం నీలం రంగులో లేదా ఉదా రంగు లోకి మారిపోతుంది. ఈ పంట కాలం దాదాపు నాలుగు నెలలు ఇది పండడానికి 100 నుండి 120 రోజులు సమయం పడుతుంది. మామూలు బియ్యం కిలో 50 నుండి 100 రూపాయలు ఉంటే ఈ బియ్యం మాత్రం 250 నుండి 500 వరకు ఉంటాయి ఇలా ఈ బియ్యం పండించి మంచిగా లాభాలు సంపాదించుకోవచ్చు.