ఐ డోంట్ కేర్ అంటున్న మెగా డాటర్.. కారణం..?

-

టాలీవుడ్ నటి మెగా ఫ్యామిలీ ముద్దుల కూతురు నిహారిక కొణిదెల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన తొలి హీరోయిన్ కూడా ఈమె. అంతేకాదు మెగా ప్రిన్సెస్ గా గుర్తింప తెచ్చుకున్న ఈమె కొంతవరకు తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేసింది. కానీ వెండితెరపై అంతగా కలిసి రాకపోయేసరికి నిర్మాతగా మారి పలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తోంది. గతంలో జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకొని ఒక ఇంటి కోడలి అయిన ఈమె పెళ్లి తర్వాత మాత్రం మరింత యాక్టివ్ గా మారింది. సోషల్ మీడియాలో ప్రతిరోజు ఏదో ఒక పోస్ట్ తో హల్చల్ చేస్తూ ఉంటుంది మెగా డాటర్ నిహారిక.

హాట్ హాట్ లుక్ తో అందరినీ ఫిదా చేస్తూ.. టీనేజ్ గర్ల్స్ లా యువతను తనవైపు తిప్పుకుంటుంది. అంతేకాదు తన భర్తతో కలిసి దిగి రొమాంటిక్ ఫోటోలు కూడా ఆమె షేర్ చేసుకుంటూ బాగా ట్రోల్స్ ఎదుర్కొంటుంది. ట్రిప్స్ కూడా ఎంజాయ్ చేస్తోంది. పైగా నాగబాబుకు గారాల కూతురు కాబట్టి చాలా ఫ్రీడం కూడా దొరకడంతో నెగెటివిటీ కూడా మూటగట్టుకుంటుంది. ఇదివరకే తన జిమ్ ట్రైనర్ తో చనువుగా ఉండటం వల్ల బాగా విమర్శలు ఎదుర్కొంది. ఫుడింగ్ అండ్ మింక్ పబ్ రైడ్ లో డ్రగ్స్ కేసులో పోలీసులకు కూడా చిక్కింది . అలా కొన్ని రోజులు ఇన్ స్టా కి దూరమైన ఈమె మళ్ళీ రిఫ్రెష్ అయ్యి ఇటీవలే ఇన్స్టా లో అడుగుపెట్టి రకరకాల పోస్ట్లు , స్టోరీలు షేర్ చేస్తూ వస్తోంది.

ప్రస్తుతం పొట్టి పొట్టి బట్టలతో దర్శనమిచ్చే ఈమె.. తనను ఎవరు ఏమన్నా ఎలాంటి నెగటివ్ కామెంట్లు చేసిన డోంట్ కేర్ అంటూ తన లైఫ్ తాను ఎంజాయ్ చేస్తోంది.. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పంచుకొని అందులో కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ..” నేను నవ్వాను లోకం ఏడ్చింది.. నాకు ఇంకా లోకంతో పని ఏముంది ” అంటూ ఒక స్టోరీ పంచుకుంది. మొత్తానికైతే నిహారిక షేర్ చేసిన ఈ స్టోరీ ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news