మీరు ఏదైనా బిజినెస్ ని మొదలుపెట్టాలి అనుకుంటున్నారా..? ఆ బిజినెస్ ద్వారా మంచిగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ఈ బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ద్వారా మంచిగా డబ్బులు సంపాదించుకోవడానికి అవుతుంది. పైగా పెట్టుబడి కూడా తక్కువే. వ్యవసాయ రంగంలో అధిక లాభాలను పొందాలి అనుకుంటే పుట్టగొడుగుల పెంపకం మంచి ఆలోచన. దీనిని మొదలు పెట్టి మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు.
అయితే ఈ బిజినెస్ ఎలా చేయాలి..?, సాగు విధానం ఏమిటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. పొట్టగొడుగులకి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది పుట్టగొడుగులను పెంచుతూ అధికంగా రాబడిని పొందుతున్నారు. మీరు కూడా ఈ వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే ఐదు వేలు ఉంటే సరిపోతుంది.
అక్టోబర్ నుండి మార్చి వరకు ఎక్కువగా వీటిని సాగు చేస్తారు. ఎందుకంటే ఎండాకాలంలో వీటి సాగు కొంచెం కష్టం. ఒకవేళ కనుక మీరు షెడ్లు, ఫామ్ హౌస్ నిర్మించుకుంటే ఏడాది పొడుగునా ఈ వ్యాపారం చేసుకోవచ్చు. ఈ పుట్టగొడుగుల పెంపకం కి గోధుమ లేదా బియ్యం గడ్డిని కొన్ని రసాయనాలతో కలిపి కంపోస్ట్ ఎరువు తయారు చేస్తారు.
దీనిని రెడీ చేయడానికి నెల రోజులు పడుతుంది. పుట్టగొడుగుల గింజలు ఆరు నుండి ఎనిమిది అంగుళాలు మందపాటి పొరను గట్టి ప్రదేశంలో నాటాలి. విత్తనాలు కంపోస్ట్ తో కప్పబడి ఉంటాయి. 40 నుంచి 50 రోజుల్లోనే పుట్టగొడుగులను విక్రయించడానికి అనువుగా పుట్టగొడుగులు ఎదుగుతాయి. మీరు షెడ్ లో కానీ ఇంట్లో కానీ వీటిని పెంచచ్చు. అధిక ఉష్ణోగ్రతల వల్ల పంట నష్టం కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక చదరపు మీటర్ కి 10 కిలోల పుట్టగొడుగులు ఉత్పత్తి చేసుకోవచ్చు. ఖర్చు కంటే పది రెట్లు లాభం పుట్టగొడుగుల పెంపకం ద్వారా పొందొచ్చు. ఇలా అధికంగా రాబడిని పొందడానికి ఈ బిజినెస్ బాగుంటుంది.