Sreeleela: యంగ్ హీరోయిన్ ఫుల్ బిజీ..వరుస సినిమాలతో దూసుకుపోతున్న శ్రీలీల

-

టాలీవుడ్ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నటుడిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘పెళ్లి సందD’. సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ఇందులో హీరోగా నటించగా, ఆయనకు జోడీగా కన్నడ భామ శ్రీల హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో శ్రీలల తెలుగు చిత్ర సీమకు హీరోయిన్ గా పరిచయం అయింది. ‘పెళ్లి సందడి’ మూవీలో ముద్దుగుమ్మ శ్రీలీల అభినయం, నటనకు తెలుగు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు.

ఈ క్రమంలోనే శ్రీలీలకు తెలుగు సినిమాల్లో చక్కటి అవకాశాలు లభించాయి. వరుస సినీ ఆఫర్లు రావడంతో ఈ భామ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ లోకి వెళ్తుందని సినీ పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం ఈ భామ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.

మాస్ మహారాజ రవితేజ – త్రినాథ రావు నక్కిన కాంబోలో తెరకెక్కుతున్న ‘ధమాకా’ పిక్చర్ లో ఈభామనే కథానాయిక. దీంతో పాటు గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు హీరోగా లాంచ్ అవుతున్న చిత్రంలోనూ హీరోయిన్ గా సెలక్ట్ అయింది.

యూత్ స్టార్ నితిన్- ఫేమస్ రైటర్, డైరెక్టర్ వక్కంతం వంశీ కాంబో ఫిల్మ్ లోనూ ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. దిల్ రాజు కుటుంబం నుంచి హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ రెడ్డి సెకండ్ ఫిల్మ్ ‘సెల్ఫిష్’లోనూ ఈ భామనే హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు టాక్. మొత్తంగా ఈ భామ వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నదని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news