బిజినెస్ ఐడియా: ఈ వ్యాపారాలతో ఎక్కువ రాబడి వస్తుంది.. పెట్టుబడి తక్కువే..!

-

ఈ మధ్య కాలం లో చాలా మంది వ్యాపారాలను చేయడానికి ఇష్ట పడుతున్నారు. నిజానికి వ్యాపారాల ద్వారా మంచిగా రాబడిని పొందుతున్నారు. మీరు కూడా ఏదైనా వ్యాపారంని మొదలు పెట్టాలనుకుంటున్నారు..? వాటి ద్వారా మంచిగా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే మీ కోసమే బిజినెస్ ఐడియాస్.

 

వీటిని కనుక మీరు ఫాలో అయ్యారంటే కచ్చితంగా మంచిగా లాభాలు వస్తాయి. ఈ వ్యాపారంల వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు. పైగా పెట్టుబడి కూడా చాలా తక్కువ. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందాలనుకునే వారికి ఈ బిజినెస్ ఐడియాస్ బాగుంటాయి. మరి ఇక వాటి కోసం చూసేద్దాం.

ఫుడ్ పార్లర్:

మొబైల్ ఫుడ్, డైట్ ఫుడ్ షాప్, ఫాస్ట్ ఫుడ్ పార్లర్ వంటివి మొదలు పెట్టొచ్చు. వీటిలో మీకు ఏది నచ్చితే దానిని మీరు తక్కువ పెట్టుబడి తోనే మొదలు పెట్టొచ్చు మొబైల్ ఫుడ్ స్టోర్ ద్వారా కొంత డబ్బులతో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. అయితే మీరు క్వాలిటీ గురించి బాగా శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి.

కాటన్ బడ్స్:

కాటన్ బెడ్స్ తో కూడా మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎవరైనా సరే ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టొచ్చు. ప్రస్తుతం కాటన్ బడ్స్ సేల్స్ బాగున్నాయి మీరు వీటిని సేల్ చేసి చక్కగా డబ్బులు సంపాదించుకోవచ్చు.

సబ్బులు తయారు చేయడం:

సబ్బులు తయారు చేయడం ద్వారా కూడా మంచిగా డబ్బులు సంపాదించుకోవడానికి అవుతుంది. అయితే సబ్బులు ఎలా తయారు చేసుకోవాలి అనేది మీకు తెలియాలి. దీన్ని మొదలుపెట్టడానికి లక్షన్నర నుంచి రెండు లక్షలు ఖర్చవుతుంది. గ్లిజరిన్, మూలికలు, ఎసెన్షియల్ ఆయిల్స్, మైక్రోవేవ్ మీకు అవసరమవుతాయి. ప్రభుత్వం కొన్ని కోర్సులు కూడా ఈ వ్యాపారానికి సంబంధించి ఇస్తోంది.

ఇంట్లో తయారుచేసిన చాక్లెట్లు:

హోమ్ మేడ్ చాక్లెట్స్ తయారు చేసి కూడా మీరు మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. 10,000 కంటే తక్కువ పెట్టుబడి తో ఈ వ్యాపారం ని మీరు మొదలు పెట్టొచ్చు. అయితే ఈ వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు చాక్లెట్ ఫ్లేవర్, ప్యాకింగ్, డెలివరీ గురించి బాగా శ్రద్ధ పెడుతూ ఉండాలి. ఇలా వీటితో మీరు చక్కగా ఆదాయాన్ని పొందచ్చు పైగా ఖర్చుకూడా తక్కువే.

Read more RELATED
Recommended to you

Latest news