టాలీవుడ్ అగ్ర హీరో బాలకృష్ణ గురించి తెలియని వారు ఉండరు. బాలయ్య మాస్ సినిమాలకు అభిమానులు కూడా ఎక్కువే. టాలీవుడ్ మాస్ సినిమాలు అంటేనే బాలయ్య.. బాలయ్య అంటేనే మాస్ సినిమాలు అన్నట్టు ఎదిగారు. ఇటీవల వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా ప్రభావం ఉన్నా.. ఏపీలో టికెట్ ధరలు తక్కువగా ఉన్నా.. అఖండకు కలెక్షన్ల సునామి వచ్చింది. ఈ సినిమా హిట్ తో బాలయ్య ఫాలోయింగ్ మరోసారి స్పష్టం అయింది. కాగ బాలయ్య పర్సనల్ లైఫ్ గురించి కూడా చాలా మందికి తెలుసు.
ఆయన సతీమని వసుంధర. అతనికి బ్రాహ్మణి, తేజస్విని అనే ఇద్దరు కుమార్తేలు ఉన్నారు. అలాగే మోక్షజ్ఞ అనే కుమారుడు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు తాజా గా ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదే బాలయ్య ప్రేమాయణం. అప్పట్లో తమిళనాడుకు చెందిన ఒక స్థార్ హీరోయిన్ తో బాలయ్య ప్రేమాయణం నడిపించారనే వార్త ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది. కాగ ఈ విషయాన్ని బాలయ్య కాస్టూమ్ విభాగంలో పని చేసిన బిగ్ బాస్ నాన్ స్టాప్ కంటెస్టెంట్ శ్రీ రాపాక బయట పెట్టింది.
బాలయ్య ప్రేమాయణం గురించి శ్రీ రాపాక చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షూటింగ్ స్పాట్ లలో బాలయ్య తన పర్సనల్ విషయాలను కూడా పంచుకుంటారని శ్రీ రాపాక తెలిపింది. అందులో భాగంగా ఒక సారి బాలయ్య తన లవ్ స్టోరీని కూడా చెప్పాడని తెలిపింది. అయితే హీరోయిన్ పేరు చెప్పకుండానే శ్రీ రాపాక ఈ విషయాన్ని బయట పెట్టింది.
ఆ హీరోయిన్ ను బాలయ్య సిన్సియర్ గా ప్రేమించాడని.. అయితే తండ్రి ఎన్టీఆర్, అన్న హరికృష్ణ కు ఇష్టం లేక పోవడంతో ఈ లవ్ స్టోరీ బ్రేకప్ అయిందని తెలిపింది. అయితే బాలయ్య మనసు పారేసుకున్న హీరోయిన్ ఎవరబ్బా.. అని నందమూరి ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు.