ఏమైనా బిజినెస్ స్టార్ట్ చెయ్యాలని వుందా…? అయితే ఈ ఐడియా మీకోసం. మరి దీని కోసం పూర్తిగా తెలుసుకోండి. నెలకి రూ. 2 లక్షలు వరకు పొందండి. ఈ వ్యాపారానికి ఎక్కువ ఖర్చు కూడా పెట్టక్కర్లేదు. మంచి ఆదాయం కూడా మీరు పొందవచ్చు. తక్కువ ఖర్చుతో క్రికెట్ బంతిని తయారు చేయడానికి పరిశ్రమను ఏర్పాటు చేసుకుంటే ఈజీగా డబ్బుల్ని సంపాదించొచ్చు.
ఆట వస్తువులని మార్కెట్ లో ఎప్పుడూ కొనుక్కుంటూనే వుంటారు. అందుకే మీరు ఈ క్రికెట్ బాల్ బిజినెస్ చేస్తే ఎప్పుడు మంచి లాభాలే వస్తాయి. ఈ వ్యాపారానికి తోలు, దారం, పోలిష్ మరియు ఉన్ని ఉపయోగించబడతాయి. దీని కోసం కొన్ని ప్రత్యేక యంత్రాలను కూడా ఉపయోగిస్తారు.
అలానే పని చేయడానికి కార్మికుల్ని, మార్కెటింగ్ చేయడానికి ఉద్యోగుల్ని కూడా పెట్టుకోవాల్సి వుంటుంది. ఈ బిజినెస్ ని స్టార్ట్ చెయ్యాలి అంటే..? రూ .5 లక్షల పెట్టుబడి పెట్టాలి. తాజాగా ఒక వ్యక్తి ఈ బంతి బిజినెస్ ని ప్రారంభించగా… అతనికి 4 లక్షల 23 వేలు పెట్టుబడి కింద పెట్టాడు. ఇలా ఇంత డబ్బు తో క్రికెట్ బాల్ తయారీ యూనిట్‌ను స్టార్ట్ చేసేయొచ్చు.
మీరు అంత పెట్టుబడి పెట్టారనుకోండి అప్పుడు సుమారు 90 వేల బంతులను తయారు చేయవచ్చు మరియు దీని పై మీ మొత్తం ఉత్పత్తి వ్యయం సుమారు 18 లక్షల రూపాయలకు వస్తుంది. మీ అంచనా అమ్మకాలు 20 లక్షల రూపాయలు. ఇలా కనుక మీరు వ్యాపారం చేస్తే మీకు నెలకి సుమారు 2 లక్షల రూపాయల ఆదాయాన్ని పొందవచ్చు.