ఆడాళ్ళ కోసం రూపొందించిన యోగా ఇది…!

-

మానసిక ప్రశాంతత కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు జనం. ముఖ్యంగా యోగ, ఫిట్‌నెస్‌ కోసం రకరకాల ఎక్సర్‌సైజులు చేస్తుంటారు. వీటిని మిక్స్‌ చేసి బిజ్జీగోల్డ్‌ అనే సెలబ్రిటీ ట్రైనర్‌ ఒక ప్రయత్నం చేసారు. ఏడేళ్ళ క్రితం బుటి యోగా అనేది ఒకటి బయటకు వచ్చింది. ఈ యోగా ప్రత్యేకంగా మహిళలకు రూపకల్పన చేసారు. ఇప్పుడు ఇది నగరాల్లో మహిళలను ఊపేస్తుంది.

యోగా అంటే ఒక చోట కూర్చొని చేస్తూ ఉంటారు. అలా కాకుండా బుటి యోగ వల్ల ఒంట్లో క్యాలరీలను కూడా తగ్గించుకోవచ్చు. 75 నిమిషాలు ఈ యోగా చేస్తే 800 నుంచి 1000 క్యాలరీలు ఖర్చవుతాయని యోగా చేసిన వాళ్ళు చెప్తున్నారు. పొట్ట తగ్గి స్లిమ్ గా అవ్వాలి అంటే ఈ యోగా చెయ్యాల్సిందే. ఈ యోగా గిరిజన నృత్యాలు, హిప్‌ హాప్‌ పాటలతో లయబద్ధంగా సాగిపోతుంది.

ప్రారంభం నుంచి చివరి వరకు క్రమపద్ధతిలో, కదలికలతో శిఖరాగ్రానికి తీసుకెళ్తుంది. అయితే మనసు కేంద్రీకృతమైతేనే గానీ, పాటలకు తగ్గట్టుగా శరీరాన్ని కదిపే అవకాశం ఉండదు. ఇవి రెండూ ఏకకాలంలో సాగుతాయి కాబట్టే ఈ ‘బుటి యోగ’తో చక్కని ఫలితాలుంటాయని అంటున్నారు నిపుణులు. కాకపోతే వట్టి పాదాలతోనే పాల్గొంటారు కాబట్టి, మూవ్‌మెంట్స్‌ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version