సీతాకోక చిలుకలు మూత్రాన్ని తాగుతాయట..ఎందుకో తెలుసా?

-

అవునా.. సీతాకోక చిలుకలు మూత్రాన్ని తాగుతాయా అనే డౌట్ అందరికి రావడం సహజం.. ఒక్క సీతాకోక చిలుకే కాదు.. మకరందాన్ని పీల్చే తేనెటీగలు కూడా ఇలానే చేస్తాయట. అయితే మనుషుల మూత్రాన్ని కాదులెండి.. మొసలి, తాబేలు, జంతువుల ముత్రాన్ని కూడా తాగుతాయట. సాధారణంగా సీతాకోక చిలుకలు ఏమి తింటాయి..? అంటే.. పువ్వుల్లోని మకరందాన్ని తాగుతాయని ఠక్కున చెప్తారు. కానీ.. అమెజాన్ అడవుల్లోని ఉన్న సీతాకోక చిలుకలు మకరందాన్ని తినవట. అవి మూత్రాన్ని ఆహారంగా తాగతాయట. నమ్మశక్యంగా లేదు కదూ..కానీ ఇది నిజం..అంతేకాదు వాటికి రంగులు కూడా మారతాయి.. అసలు విషయానికొస్తే..

 

ఓసారి అమెజాన్ అడవుల్లో ఒక శాస్త్రవేత్త పర్యటిస్తుండగా.. అతను కొన్ని సీతాకోక చిలుకలను పరిశీలించాడట. అవి మొసలి.. తాబేళ్ల మూత్రాన్ని తాగడం గమనించాడట. ఇలా ఎందుకు పీలుస్తున్నాయని.. అనుమానం తో కొన్ని రోజుల పాటు పరిశోధన చేశాడట. ఎప్పుడూ మకరందాన్ని తాగే వీటికి లవణాలు అవసరం. ఉప్పులో ఉండే పోషక పదార్థాలతో ఇవి గుడ్లు పెట్టి.. వాటి జీవిత చక్రాన్ని సాఫీగా చేయగలవు.

మూత్రం ఉప్పగా ఉంటుందన్న విషయం వినే ఉంటారు..  అవును.. నిజం.. ఉప్పగా ఉంటాయి. అందుకే అవి జంతువుల ముత్రాన్ని మాత్రమే కాదు.. వాటి కన్నీళ్లు, చెమట ఎక్కడ లవణాలుంటే అక్కడ ఈ మకరంద జీవులు వాలిపోతాయట. కేవలం సీతాకోక చిలుకలే కాదు.. తేనెటీగలు కూడా ఇలానే చేస్తాయట.ఈ వార్త చదిపిన వాళ్ళు ఇక తినడం మానేస్తారేమో మరి.. ఏమో అది మీ ఇష్టం.. మీకు నమ్మశక్యం కాకుంటే.. మీ చుట్టుపక్కల సీతాకోక చిలుకలను ఒకసారి గమనించండి.. అవి ఏం చేస్తున్నాయని..మేము చెప్పింది నిజమే అయితే కామెంట్ చెయ్యండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version