Breaking : జమ్మూకశ్మీరులో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం..

-

జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. జమ్మూకశ్మీరులోని షోపియాన్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరిగింది. షోపియాన్ జిల్లా కప్రెన్ ప్రాంతంలో జైషే మహ్మద్ గ్రూపునకు చెందిన ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర కేంద్ర భద్రతా జవాన్లు, జమ్మూకశ్మీర్ పోలీసులతో కలిసి శుక్రవారం తెల్లవారుజామున గాలింపు చేపట్టారు. ఉగ్రవాదులు కాల్పులు జరపగా, భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జైషే మహ్మద్ గ్రూప్ ఉగ్రవాది ఒకరు హతమయ్యారు. భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం ఇంకా గాలింపు కొనసాగిస్తున్నాయి. ఈ కాల్పుల్లో కుల్గాం షోపియాన్ కాప్రెన్ ప్రాంత జైషే మహ్మద్ ఉగ్రవాది కమ్రాన్ భాయ్ అలియాస్ హనీస్ మరణించాడని కశ్మీర్ సహాయ డీజీపీ శుక్రవారం ట్వీట్ చేశారు. ఎన్‌కౌంటర్ నేపథ్యంలో షోపియాన్ జిల్లాలో పోలీసులు అలర్ట్ అయ్యారు.

ఇదిలా ఉంటే.. కుప్వారాలో ఓ నకిలీ ఎన్జీవో గుట్టురట్టు గురువారం కుప్వారా జిల్లాలో ఉగ్రవాద ఫైనాన్సింగ్, రిక్రూట్‌మెంట్ చేస్తున్న నకిలీ ఎన్జీవో సంస్థకు చెందిన 6 మంది నిందితులను అరెస్టు చేశారు. ఆర్మీకి చెందిన ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఐఈడీ మెటీరియల్‌‌‌‌, 5 పిస్టల్స్‌‌‌‌, 2 గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర కాశ్మీర్‌లో పనిచేస్తున్న టెర్రర్ ఫండింగ్ , రిక్రూట్‌మెంట్ మాడ్యూల్‌ను కుప్వారా పోలీసులు ఛేదించారని కుప్వారా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పి) యుగల్ మన్హాస్ తెలిపారు. జిల్లాలోని చిర్కోట్ ప్రాంతానికి చెందిన బిలాల్ అహ్మద్ దార్ గురించి సమాచారం అందుకున్న తరువాత, అతనిని పట్టుకోవడానికి భద్రతాదళాలు. పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version