మొగలిరేకులు సాగర్ హీరోగా సినిమా.. ఆ దర్శకుడి నిర్మాణం !

-

ప్రముఖ దర్శకుడు, రచయిత బివిఎస్.రవి నిర్మాతగా మొగలిరేకులు సాగర్ హీరోగా కొత్త దర్శకుడు రమేష్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఒకటి లాంచ్ అయింది. గ‌తంలో సెకండ్ హ్యాండ్ అనే సినిమాతో టాలెంటెడ్ డైరెక్ట‌ర్ కిషోర్ తిరుమ‌ల‌ని తెలుగు చిత్ర సీమ‌కు అందించిన బీవిఎస్ ర‌వి ఇప్పుడు ర‌మేశ్ అనే మరో దర్శకుడిని లాంఛ్ చేస్తున్నారు. మొగలిరేకులు సీరియల్ తో మంచి ఫేమస్ అయిన నటుడు సాగర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

ఎప్ప‌టి నుంచో బివిఎస్ ర‌వికి, నటుడు సాగ‌ర్ కి సాన్నిహిత్యం ఉంది. ఆ మధ్య సాగర్ ఒకటిరెండు సినిమాలు చేసినా అవి పెద్దగా వర్కవుట్ కాలేదు. ఈ నేప‌థ్యంలోనే సాగ‌ర్ ని హీరోగా మ‌రో మారు ప్రేక్ష‌కుల ముందుకి తీసుకువ‌స్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు కూడా మంచి స్కోప్ ఉంటుందట. ఇక ఈ సినిమా దర్శకుడు రమేష్ గతంలో గౌతమ్ మీనన్, వైవిఎస్.చౌదరి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశాడని అంటున్నారు. ఇక ఈ సినిమా గురించి మరింత సమాచారం త్వరలో చిత్ర వెల్లడి అయ్యే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news