త్వరలోనే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివాదస్పదమైన ‘పౌరసత్వ సవరణ చట్టం-2019’ ను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో…CAAపై తమ అభిప్రాయం మారదని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ స్పష్టం చేశారు. ‘ఇది మత విభజన చట్టం. ముస్లింలను ద్వితీయ శ్రేణికి తగ్గించాలనే గాడ్సే ఆలోచనలకు ప్రతిరూపం అని ఆరోపించారు. వలస వచ్చినవారికి ఆశ్రయం ఇవ్వండి కానీ మతాన్ని బట్టి పౌరసత్వాన్ని ఇవ్వొద్దు అని కోరారు. ఐదేళ్లు పెండింగ్లో ఉంచి, ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారో చెప్పాలి అని డిమాండ్ చేశారు. NPR,CAA అంటే ముస్లింలను టార్గెట్ చేయడమే అని అన్నారు. వీటి వ్యతిరేకులు మళ్లీ వీధుల్లోకి రాక తప్పుదు’ అని ఒవైసీ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే….పౌరసత్వ సవరణ చట్టం-2019 కోసం త్వరలో అందుబాటులోకి తెచ్చే పోర్టల్లో పౌరసత్వం కోసం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం బాధితులను కోరింది.ఈ చట్టం 2014 డిసెంబరు 31 కంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ ,పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి.