ఆయనతో బిడ్డను కనాలనుకున్నా: నటి జయలలిత

-

నటి జయలలిత సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.దివంగత నటుడు శరత్ బాబును తాను ప్రేమించానని నటి జయలలిత అన్నారు. ఇద్దరం కలిసి బిడ్డను కనాలనుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఆయన్ను నేను బావా అని పిలిచేదాన్ని అని ,కలిసి ఎన్నో యాత్రలు చేశాం అని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడాయన లేరు కాబట్టి చెబుతున్నా. పెళ్లి చేసుకోవాలనుకున్నాం. బిడ్డను కనాలనుకున్నాం అని ఇండస్ట్రీ వాళ్లే ఆపేశారు’ అని అన్నారు. సుమారు 650కి పైగా సినిమాలు చేసిన జయలలిత ప్రస్తుతం టీవీ సీరియళ్లలో నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే….తన భర్తపై సీనియర్ నటి జయలలిత సంచలన వ్యాఖ్యలు చేశారు.నేను ప్రేమ వివాహం చేసుకున్నా వ్యక్తికి అప్పులు, ఆర్థిక ఇబ్బందులు ఉండేవి అని తెలిపారు. నా డబ్బులు, నగలు తీసుకొని ,నా ఆస్తులకు పౌరాఫ్ అటర్నీ కూడా రాయించుకున్నారు అని అన్నారు. పెళ్లి అయిన ఆరు నెలలకే మా మధ్య గొడవలు జరిగి, చంపేందుకు నా భర్త అంబాసిడర్ కారులో నన్ను తీసుకెళ్లారు.అయితే ఓ బాబా వచ్చి కాపాడాడని ఆమె వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news