భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నేత కైలాష్ విజయవర్గియా కీలక వ్యాఖ్యలు చేసారు. ఆయన శనివారం మాట్లాడుతూ… నరేంద్ర మోడీ ప్రభుత్వం 2021 జనవరి నుండి బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ నుండి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడం ప్రారంభించే అవకాశం ఉందని చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం శరణార్థులకు పౌరసత్వం ఇచ్చే ప్రక్రియ వచ్చే ఏడాది జనవరి నుండి ప్రారంభమవుతుందని తాను ఆశిస్తున్నా అన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో అధిక సంఖ్యలో శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడానికి బిజెపి ఆసక్తి చూపుతోందని ఆయన తెలిపారు. విజయవర్గియా వ్యాఖ్యపై స్పందించిన తృణముల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీమ్ పశ్చిమ బెంగాల్ ప్రజలను మోసం చేయడానికి బిజెపి ప్రయత్నిస్తోందని అన్నారు. తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) నుండి 1950 లలో పశ్చిమ బెంగాల్ కు వలస రావడం ప్రారంభించారు.