కొరటాల ప్లాన్.. ఆచార్యలో రామ్ చరణ్ కి జోడీ అక్కడి నుండే..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నలభై శాతం వరకూ షూటింగ్ జరుపుకుంది. మరికొద్ది రోజుల్లో మిగతా భాగం షూటింగ్ జరుపుకోనుంది. ఐతే ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడని ఇంతకుముందే చెప్పారు. అతిధి పాత్రలో కాకుండా ఒక అరగంట పాటు తెరపై కనిపించే రామ్ చరణ్ కోసం హీరోయిన్ కూడా ఉంటుందని వినబడింది.

ఐతే ఆ హీరోయిన్ ఎవరా అనే విషయమై చిత్రబృందం బాగా ఆలోచిస్తుంది. తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ సరసన ఆచార్యలో బాలీవుడ్ హీరోయిన్ నటిస్తుందట. ఆ హీరోయిన్ ఎవరా అనేది ఇంకా తేలక పోయినప్పటికీ, బాలీవుడ్ భామనే తీసుకోవాలని అనుకుంటున్నారట. దానికి ప్రత్యేక కారణం ఉందని తెలుస్తుంది. ఆచార్య సినిమాకి బాలీవుడ్ లో క్రేజ్ రావడానికి, అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్ విషయంలో క్రేజ్ తీసుకురావడానికి బాలీవుడ్ అందాలని ఆచార్యలోకి తీసుకురానున్నారట. మరి రామ్ చరణ్ సరసన నటించే ఆ బాలీవుడ్ నటి ఎవరో..!