రోడ్డు పైకి వచ్చి ఇంటికి వెళ్లే వరకు సేఫ్‌గా ఇంటికి వెళతామన్న గ్యారెంటీ లేదు. పెరిగిపోతోన్న వాహనాలు… త్వరగా గమ్యం చేరుకోవాలన్న ఆత్రుత వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతుంటే.. డ్రైవర్ల నిర్లక్ష్యం… ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రమాదం చూస్తే వాహన డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్ల నిర్లక్ష్యానికి తీవ్రమైన పరాకాష్టగా నిలుస్తుంది.
ఈ ఘోర ప్రమాదంలో ఓ నిండుప్రాణం బలైంది. ఒకరి నిర్లక్ష్యానికి మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. ఓ క్యాబ్ డ్రైవర్ అజాగ్రత్త, నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణీకులను ఎక్కించుకునేందుకు ఓ క్యాబ్ డ్రైవర్ నోపార్కింగ్ జోన్‌లో కారును నిలిపిపాడు. ఈ క్రమంలోనే యాదయ్య అనే ఓ ప్రయాణికుడు క్యాబ్ ఎక్కేందుకు వచ్చాడు.
యాదయ్య క్యాబ్ ఎక్కుతుండగా.. పోలీస్ వాహనం రావాడం గమనించిన క్యాబ్ డ్రైవర్ కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు. అయితే.. సుమారు ఎనిమిది కిలో మీటర్ల తర్వాత శంషాబాద్ టోల్‌గేట్ వద్ద ఈ విషయాన్ని సిబ్బంది గమనించి క్యాబ్ డ్రైవర్‌కు చెప్పారు. అప్పటికే గమనించి చూడగా అప్పటికే వాహనదారుడు ప్రాణాలను విడిచాడు. దీంతో మృతదేహాన్ని, కారును వదిలి క్యాబ్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే.. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.