కాఫీ, చిన్నపాటి స్నాక్స్ కు పరిమితం అయినా కూడా ఆ వ్యాపారంలో మార్పు తెచ్చిన దిగ్గజం సిద్ధార్ధ్ జైన్. కానీ ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయి అతను కొంత కాలం క్రితం బెంగళూరు సమీపం లోని చిత్రావది నదిలో దూకి ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసినదే. ప్రముఖ వ్యాపారవేత్త సిద్ధార్ధ్ జైన్ కాఫీ డే పేరు తో దేశ వ్యాప్తంగా ఔట్ లెట్లను ఏర్పాటు చేసాడు. అప్పుడు సిద్ధార్ద్ ప్రారంభించిన ఈ కేఫ్ కాఫీ డే ఔట్ లెట్స్ ఇప్పుడు మరెంత చిక్కుల్లో పడ్డాయి.

అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ఔట్‌లెట్‌లలో దాదాపు 280 ఔట్‌లెట్‌లు మూతపడ్డట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి క్వార్టర్ లో కొన్ని ఔట్ లెట్స్ ని మూసివేశారు. గత సంవత్సరంలో కూడా కొన్ని ఔట్ లెట్స్ ని ఖర్చులు పెరగడం వల్ల మూసివేశారు.ఈ ఏడాది జూన్ 30 నాటికి ఈ కాఫీ డే ఔట్ లెట్స్ సంఖ్య 1,480 కి తగ్గింది.