రైతులకు శుభవార్త.. రైతుబంధు కోసం ప్రత్యేక కాల్‌ సెంటర్‌

-

తెలంగాణలోని రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలోనే రైతుబంధు పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక, వ్యవసాయశాఖలకు ఆదేశాలు జారీ చేశారని, గత తరహాలోనే ఈ వానాకాలం కూడా సకాలంలో సొమ్ము జమ చేస్తామన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. రైతులెవరూ అపోహ పడవద్దని, ఎకరా నుంచి 2, 3,4, 5 ఎకరాల చొప్పున రైతు బంధు డబ్బులు జమ చేయడాన్ని ప్రారంభిస్తామని తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి. రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు కొంత ఆలస్యం జరిగిందని, కేంద్రం సహకరించకపోయినా రైతుబంధును గతంలో లాగే ఇస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. అతి త్వరలోనే రైతుల ఖాతాల్లో వేసేందుకు సిద్ధంగా ఉన్నామని, కొన్ని ప్రత్యేకమైన రాజకీయ కారణాల వల్ల ఆలస్యం అవడం జరిగిందని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే.. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లోని రైతుబంధు సమితి కార్యాలయంలో వ్యవసాయశాఖ కాల్‌ సెంటర్‌ను ప్రారంభించారు. త్వరలోనే టోల్‌ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు రైతులకు తెలిపేందుకు, రైతుల విజ్ఞప్తులు స్వీకరించడం కోసం ఈ కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. రైతుబంధు, రైతుబీమా, ఇతర పథకాలకు సంబంధించి ఏ ఇతర వివరాలైన సేకరించడానికి కాల్ సెంటర్ ఉపయోగపడుతుందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version