టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ధోనీ తన రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే సురేశ్ రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇది నిజంగా క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే ఇప్పుడు తాజాగా మరో ఆటగాడు క్రికెట్ కు గుడ్‌బై చెప్పాడు. కాకపోతే అతను టీం ఇండియా ఆటగాడు కాదు.. ఆస్ట్రేలియా ఆటగాడు. మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ కామెరాన్ వైట్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. ఇకపై కోచింగ్‌పై దృష్టిపెట్టాలనుకుంటున్నట్టు కామెరాన్ క్రికెట్ ఆస్ట్రేలియాకు తెలిపాడు.
అయితే ఆస్ట్రేలియా తరఫున 91 వన్డేలు, 47 టీ20లు, 4 టెస్ట్‌లు ఆడిన కామెరాన్ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఏడు మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. ఐపీఎల్‌లో 2007-12 మధ్య రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, డెక్కన్ చార్జెస్ జట్ల తరఫున బరిలోకి దిగాడు. 2013లో సన్‌రైజర్స్ తరఫున ఆడాడు. ఇక ఆస్ట్రేలియా తరఫున 2018లో ఇంగ్లండ్‌పై చివరి వన్డే ఆడిన కామెరాన్.. నిలకడలేమి ఫామ్‌తో జట్టుకు దూరమయ్యాడు. 10 డొమెస్టిక్ ట్రోఫీలు గెలుచుకున్న వైట్.. 6 షెఫీల్డ్ షీల్డ్స్, డొమెస్టి వన్డే క్రౌన్‌తో పాటు ఓల్డ్ స్టేట్ టీ20 లీగ్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. బిగ్ బాష్ లీగ్ ట్రోఫీ విజేతగా కూడా నిలిచాడు.