నల్ల ద్రాక్షాను రోజూ తినవచ్చా..? బరువు తగ్గాలంటే ఏ ద్రాక్షా తినాలి..?

-

ద్రాక్ష పండ్లను అందరూ ఇష్టపడతారు. నలుపు, ఎరుపు, ఊదా, ఆకుపచ్చ వంటి వివిధ రంగుల్లో ఇవి లభిస్తాయి. నల్ల ద్రాక్ష వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. వీటిలో విటమిన్ సి, కె, ఏ, బీ, కాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, మెగ్నీషియం పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

నల్ల ద్రాక్ష తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా?

నల్ల ద్రాక్షలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యంగా రెస్వెరాట్రాల్ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.

పొటాషియం పుష్కలంగా ఉన్న నల్ల ద్రాక్ష అధిక రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఇలా చేస్తే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

నీటి శాతం ఎక్కువగా ఉండే నల్ల ద్రాక్షలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని తినడం వల్ల మలబద్ధకం తొలగిపోయి జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

విటమిన్ సీ పుష్కలంగా ఉన్న ద్రాక్షను రోజూ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధించడంలో ఇవి సహాయపడతాయి.

విటమిన్లు, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ద్రాక్షను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. మతిమరుపును నివారించడంలో, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

బరువు తగ్గాలనుకునే వారు కూడా ద్రాక్షను తినవచ్చు. ద్రాక్షలో కేలరీలు చాలా తక్కువ. అలాగే వీటిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మేలు చేస్తాయి.

ద్రాక్షలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సీ, ఇ చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఆకుపచ్చ ద్రాక్ష కంటే నల్ల ద్రాక్ష తినడం మంచిది. ఎందుకంటే వీటిల్లో రెస్వెరాట్రాల్ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ద్రాక్షలో విటమిన్ సీ అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక వ్యవస్థను పెంచడంలో సహాయపడుతుంది. అయితే ద్రాక్షాను ఉదయం పరగడుపున తినకూడదు.. ఉదయం తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి.. ఉదయాన్ని పుల్లగా ఉండే పళ్లు ఏవీ తినకూడదు.. వీటి వల్ల గ్యాస్‌ కూడా ఫామ్‌ అయ్యే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news