ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే.. రిటైర్‌మెంట్ తర్వాత రూ.5 వేల వరకు పెన్షన్ పొందొచ్చు..!

-

ఎన్నో స్కీమ్స్ ని కేంద్రం అందిస్తోంది. అయితే వాటిలో అటల్ పెన్షన్ యోజన కూడా ఒకటి. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే చక్కగా పెన్షన్ పొందొచ్చు. మరి ఇక ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే రూ.5 వేల వరకు పెన్షన్ వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. అయితే ఈ అటల్ పెన్షన్ యోజన స్కీమ్ బెనిఫిట్స్ పొందాలంటే ఇంకా కొన్ని రోజులే అవకాశం వుంది.

18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసు కలిగిన వాళ్ళు ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టచ్చు. సెప్టెంబర్ 30, 2022 కి ముందు ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టచ్చు. కనుక అప్పటిలోగా ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టండి. గతంలో ఆదాయపు పన్ను చెల్లించినా లేదా లేకపోయినా కూడా ఈ ప్రయోజనాలు పొందేవారు కానీ అక్టోబర్ 1, 2022 తర్వాత మాత్రం అవ్వదు.

కనీసం రూ.1000 నుంచి రూ.5 వేల వరకు పెన్షన్ కింద పొందొచ్చు. మీరు కట్టే దాని బట్టీ అమౌంట్ వస్తుంది. 60 ఏళ్ల వయసు నుంచి మీకు పెన్షన్ వస్తుంది. ఆదాయపు పన్ను కట్టే వారికి ఏపీవైలో ఇన్వెస్ట్ చేస్తే ఆదాయపు పన్ను ప్రయోజనాలను ఈ స్కీమ్ ఇస్తోంది. 80సీ కింద రూ.1.5 లక్షల వరకు ప్రయోజనాలు వస్తాయి. నెలకు రూ.42 ఇన్వెస్ట్ చేస్తే రూ.1000 పెన్షస్ వస్తుంది. రూ.168 చెల్లిస్తే రూ.4 వేలు పెన్షన్ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news