బ్రెజిల్ లో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి చేసిన ఒక అధ్యయనంలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తికి మరియు డెంగ్యూ జ్వరం యొక్క గత వ్యాప్తికి మధ్య సంబంధాన్ని కనుగొంది ఈ అధ్యయనం. దోమల ద్వారా వ్యాప్తి చెందుతున్న డెంగ్యు ద్వారా కొంత రోగ నిరోధక శక్తి కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది అని గుర్తించారు. డ్యూక్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ మిగ్యుల్ నికోలెలిస్ నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది.
అయితే ఇది ఇంకా విడుదల చేయలేదు గాని రాయిటర్స్ తో దీనికి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నారు. కరోనా కేసుల వ్యాప్తిని 2019 మరియు 2020 లో డెంగ్యూ వ్యాప్తితో పోల్చింది. “డెంగ్యూ యొక్క ఫ్లావివైరస్ సెరోటైప్స్ మరియు కరోనాల మధ్య రోగనిరోధక క్రాస్ రియాక్టివిటీ దీనికి కారణం అవుతుందని పేర్కొన్నారు. ఇది గనుక నిజం అని తేలితే మాత్రం కచ్చితంగా డెంగ్యు వ్యాక్సిన్ కొంత ఉపయోగపడవచ్చు అని భావిస్తున్నారు.