మటన్ తింటే క్యాన్సర్ కచ్చితంగా వస్తుందా…?

-

నాన్ వెజ్ అనేది ఈ రోజుల్లో సాధారణ ఆహారంగా మారిపోయింది. ప్రతీ రోజు తినే వారు కూడా ఉన్నారు. ఆది లేకపోతే ముద్ద దిగే పరిస్థితి లేదనే చెప్పాలి. అయితే దాని వలన అనారోగ్యాలు చాలానే ఉన్నాయి. ప్రధానంగా పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అదే కొలోరెక్టల్ కాన్సర్ లేదా బొవెల్ కాన్సర్. ఇది వస్తే మాత్రం మీ శరీరంలో చాల అతేదాలు ఉంటాయి. ఊరికే అలసట వస్తుంది.

దానితో పాటుగా క్రమంగా నీరసం కూడా వస్తుంది. మూత్రంలో బ్లడ్ అపడటం వంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ క్యాన్సర్ రావడానికి ప్రధాన మార్గం జంతు మాంసం, ఫ్రైలు, ఆయిల్, స్పైసీ ఆహారం. ఎక్కువ రోజులు నిల్వ చేసిన మాంసం, లేదా ఎరుపు రంగులోకి మాంసం మారినా… ప్రాసెస్ చేసి ప్యాకింగ్ రూపంలో వచ్చే మాంసం తినేవారికి పెద్ద పేగు కాన్సర్ వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు.

దీనిని అడ్డుకునేందుకు గాను రేడియోథెరపీ, కీమోథెరపీ ఉన్నాయి. అయితే తొలి దశలోనే దీన్ని అదుపు చేయవచ్చు అంటున్నారు. అసలు రాకుండా కట్టడి చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం రోజుకు 50 గ్రాముల కంటే ఎక్కువ జంతు మాంసం తింటే క్యాన్సర్ వస్తుంది. వారానికి 350 గ్రాముల కంటే ఎక్కువ మాంసం మనం తింటే ఈ క్యాన్సర్ వస్తుంది.

ఫ్రై చేసిన, ప్రాసెస్ చేసిన మాంసం కంటే ఇంట్లో వండుకుని తినడం మంచిది అంటున్నారు. క్లోమం, ప్రొస్టేట్‌ కాన్సర్లకు కూడా జంతు మాంసం కారణంగా మారుతుంది. జంతుమాంసాన్ని ఎక్కువ వేడిలో వేయించడం, నిప్పుల్లో కాల్చుకు తినడం, వేపుళ్లు చేసుకోవడం, ఉప్పులో నానబెట్టి తర్వాత వాడటం మంచిది సూచిస్తున్నారు. ఆకు కూరలు ఎక్కువగా తీసుకుంటే ఆ క్యాన్సర్ రాదని అంటున్నారు. జంతుమాంసం తిని ఏటా 50 వేల మంది కాన్సర్‌ సోకి ప్రాణాలు కోల్పోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news