కండల వీరుడు సల్మాన్ “టైగర్ – 3” తో గర్జిస్తాడా !

-

బాలీవుడ్ సినిమా పరిశ్రమకు దీపావళి చాలా ప్రాముఖ్యమైనది అని తెలిసిందే. ఈ రోజున హిందీ సినిమాలు రిలీజ్ చేయడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఇక ఈ దీపావళికి కూడా బాలీవుడ్ నుండి ఒక పాన్ ఇండియా మూవీ ని రిలీజ్ చేస్తున్నారు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరియు అందాల హీరోయిన్ కత్రినా కైఫ్ లు కలిసి నటించిన “టైగర్ – 3 ” సినిమా ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 12వ తేదీన విడుదల కానుంది. మనీష్ శర్మ ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాను కేవలం ఇండియాలోనే 5000 స్క్రీన్ లలో ప్రదర్శించనున్నారు. ఈ విధంగా ఇంతకు ముందెన్నడూ ఏ హిందీ సినిమాకు జరగలేదు.

ఇక ఈ సినిమాకు మొదటి రోజు రూ. 40 కోట్ల వరకు వసూళ్లు కొల్లగొట్టాలని టార్గెట్ పెట్టుకుంది చిత్ర బృందం. మరి సల్మాన్ ఖాన్ తన చరిష్మా, స్టార్ ఇమేజ్ తో థియేటర్ లలో ఈ దీపావళికి గర్జిస్తాడా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news