కరెన్సీ నోట్ల ద్వారా వైరస్ వ్యాపించచ్చా..?

-

కరోనా మహమ్మారి వల్ల చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మూడవ వేవ్ కారణంగా చాలా మంది ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్ దేశంలో తీవ్రంగా వ్యాపించడంతో ఈ వైరస్ పై చాలా మందికి అనేక అనుమానాలు ఉన్నాయి. ఏది ఏమైనా సరే కరోనా వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

అయితే తాజాగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ కూడా కేంద్ర ఆరోగ్య శాఖ నుండి క్లారిఫికేషన్ కోరుతోంది. అయితే కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందా..? లేదా..? అన్నది చెప్పమని కేంద్ర ఆరోగ్య శాఖ ని కోరింది. అయితే మరి కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుంద లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

దేశంలో లక్షలాది మంది వ్యాపారులు పెద్ద మొత్తంలో నోట్ల తో రోజు కూడా లక్షల లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటారు. ఇటువంటి సమయంలో కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందా లేదా అన్న సంగతి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఈ వైరస్ వ్యాప్తికి కరెన్సీ నోట్లు కూడా ప్రమాదకరంగా నిలుస్తున్నాయి పలు నివేదికలు చెప్పాయని తెలిపారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ట్రేడర్లు ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం చెప్పింది. కరెన్సీ నోట్లు లో వుండే మైక్రో ఆర్గనైజమ్స్ వ్యాధులకు ఇన్ఫెక్షన్లు కారణమవుతాయి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి కరెన్సీ నోట్లతో కూడా జాగ్రత్తగా ఉండాలి లేదంటే కరోనా బారిన పడే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version