నా ధియేటర్లలో కూడా నా సినిమా వేసుకోనివ్వరా.. నిర్మాత దిల్ రాజు..

-

2023 సంక్రాంతి సినీ ప్రేక్షకులకు పండుగ వాతావరణం తీసుకువస్తుందని చెప్పాలి ఈరోజున టాలీవుడ్ నుంచి ఏకంగా మూడు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి అందులో ఒకటి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న వారసుడు చిత్రం అయితే ప్రస్తుతం ఈ సినిమా విడుదల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు థియేటర్లను దిల్ రాజు బ్లాక్ చేయించారు అని వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు..

సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ వీరన్న సింహారెడ్డి మెగాస్టార్ వాల్తేరు వీరయ్య దిల్ రాజు నిర్మాతక వ్యవహరించిన వారసుడు చిత్రాలు విడుదల కాబోతున్నాయి అయితే మిగిలిన రెండు చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ ఉండగా వారసుడు దిల్ రాజు నిర్మించారు.. అయితే ఈ సినిమా కోసం దిల్ రాజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎన్నో థియేటర్లను బ్లాక్ చేయించారు అనే వార్తలు వినిపిస్తున్నాయి..

ఈ నేపథ్యంలో దిల్ రాజు “వారసుడు చిత్ర విడుదల ఆపాలి అనుకుంటే నన్ను పిలిచి ఛాంబర్ లేదా ప్రొడ్యూసర్ కౌన్సిల్ మాట్లాడాలి. కానీ వాళ్లంతా డైరెక్ట్గా మీడియాతో ఎలా మాట్లాడుతారు ప్రజలకు అసలు సంబంధంలేని విషయాన్ని మీడియాకు చెప్పాల్సిన అవసరం ఏముంది రెండు తెలుగు రాష్ట్రాల్లో నాకు దాదాపు 70 థియేటర్స్ వరకు ఉన్నాయి నా థియేటర్లలో నా సినిమాను విడుదల చేసుకుంటే అందులో తప్పేముంది… అలాగే దిల్ రాజు ఎదుగుతున్నాడు ఎలాగైనా దెబ్బతీయాలని అనుకుంటున్నా వారికి నేను ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు.. అలాగే తమిళనాడులో 800 థియేటర్స్ ఉన్నాయి. విజయ్ అక్కడ అందరికంటే పెద్ద స్టార్. అజిత్ మూవీ కూడా విడుదల అవుతుంది. నాకు 400 థియేటర్స్ ఇస్తున్నారు. అజిత్ పెద్ద స్టార్ కాబట్టి కనీసం మరో 50 థియేటర్స్ ఇవ్వమని అడుక్కుంటున్నాను. మైత్రి మూవీ మేకర్స్ తో ఎలాంటి వివాదం లేదు. అన్ని చిత్రాలకు థియేటర్స్ దొరుకుతాయి. ఇవన్నీ జనవరి మొదటి వారంలో మాట్లాడవలసిన విషయాలు కానీ ఇప్పుడు ఎందుకు వీటి వివాదం లేవనెత్తి ఏదో చేసేస్తున్నాడు అంటూ ప్రచారం చేస్తున్నారు అర్థం కావడం లేదు..” అంటూ చెప్పుకొచ్చారు నిర్మాత దిల్ రాజు..

Read more RELATED
Recommended to you

Latest news