భారత ప్రయాణీకులపై నిషేధం పొడిగించిన కెనడా.. ఎప్పటి వరకంటే,

-

కరోనా సెకండ్ వేవ్ ఎంత ఉధృతంగా నడిచిందో అందరూ చూసారు. మొదటి వేవ్ కన్నా వేగంగా, బలంగా వచ్చిన సెకండ్ వేవ్, జనాలందరినీ భయ భ్రాంతులకు గురి చేసింది. భారతదేశంలో విజృంభించిన సెకండ్ వేవ్ కారణంగా ఇతర దేశాల వారు తమ దేశానికి రావద్దంటూ ఆంక్షలు విధించారు. అందులో కెనడా కూడా ఉంది. కరోనా కొత్త రకం డెల్టా వేరియంట్ భయం ఉండడంతో భారత దేశం నుండి కెనడా వెళ్ళడానికి నిషేధించింది.

ఏప్రిల్ 22వ తారీఖు నుండి నిషేధం విధించిన కెనడా, రోజులు మారిన కొద్దీ పొడిగిస్తూ వచ్చింది. ప్రస్తుతం సెప్టెంబరు 21వ తేదీ వరకు ఈ నిషేధం ఉండనుంది. ఆ తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయాల్లో మార్పులు ఉంటాయని కెనడా అధికారులు పేర్కొన్నారు. ఒక్క కెనడానే కాదు మొన్నటి వరకు దుబాయ్ కూడా ఇండియా ప్రయాణీకులపై నిషేధం విధించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version