క్రికెట్: కోహ్లీ డకౌట్ అవడంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ కామెంట్స్

-

భారత క్రికెట్ కెప్టెన్ కోహ్లీ ఫామ్ పై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఇంగ్లమ్డ్ తో జరుగుతున్న మొదటి టెస్టు సిరీస్ లో డకౌట్ అవడంతో ఈ విషయంపై మరింత చర్చ జరుగుతుంది. ఇంగ్లమ్డ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో మెరుపులు మెరిపిస్తాడన్ని నమ్మిన అభిమానులకు డకౌట్ అవడం మింగుడు పడలేకపోయింది. దాంతో కోహ్లీపై విమర్శలు చేస్తున్నారు. ఐతే ఈ విషయమై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ కీలక వ్యాఖ్యలు చేసాడు.

మొదటి బంతికి ఔటవడం అనేది చాలా సాధారణమైన విషయం అని, దాని గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదని, ఆటల్లో అది సహజంగా జరుగుతుందని, 5మ్యాచుల టెస్టు సిరీస్ లో కోహ్లీ మళ్ళీ ఫామ్ లోకి వస్తాడని, కోహ్లీలో ఆ నమ్మకం ఉందని అన్నాడు.
ఏ ఆటగాడైనా ఏదో ఒక సమయంలో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడతాడని, అది అందరికీ సహజమేనని, అలాంటి విషయాలు తాత్కాలికం మాత్రమేనని, ముందు ముందు ఫామ్ లోకి వస్తాడని కోహ్లీకి మద్దతు తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version