INDvsPAK మ్యాచ్ పై కెనడియన్ రాపర్ బెట్టింగ్…. ఎంత గెలిచాడంటే..?

-

ఫుట్బాల్, NFLతో సహా స్పోర్ట్స్ ఈవెంట్స్లో భారీ మొత్తంలో బెట్టింగ్ పెట్టే కెనడియన్ రాపర్ డ్రేక్ మొన్న జరిగిన ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ పై ఆసక్తి చూపారు. పాకిస్థాన్పై భారత్ గెలుస్తుందని £510,000 పందెం వేసినట్లు డ్రేక్ ఇన్స్టాలో వెల్లడించారు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ గెలుపొందడంతో అతడికి £715,000 (రూపాయలు 7.58 కోట్లు ) వచ్చాయని ,రూ. 2.16 కోట్ల లాభం పొందినట్లు స్థానిక మీడియా తెలిపింది.

కాగా, ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులకు అలౌట్ అయింది. అటు పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో…7 వికెట్లు నష్టపోయి 113 పరుగులు మాత్రమే చేసింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా దాటికి.. పాకిస్తాన్ బ్యాటర్లు విలవిలాడిపోయారు. ఈ మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టిన బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news