బీఆర్ఎస్ గుర్తింపును రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి మాజీ ఎంపీ వీ.హనుమంతరావు లేఖ రాశారు. 10 సంవత్సరాల పాలనలో సాగునీటి రంగంతో సహా వివిధ స్కీములు, ప్రాజెక్టుల్లో భారీ అవినీతికి పాల్పడినట్లు లెక్కలతో సహా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అసెంబ్లీలో సమర్పించిన రిపోర్టులో పేర్కొన్నదని ఆయన అన్నారు.బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలోని అవినీతి కారణంగా తదుపరి ప్రభుత్వాలు కాపిటల్ వ్యయంతో ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పనపై ఆర్థిక అంశాల కారణంగా దృష్టి పెట్టే అవకాశం లేకుండా అసహనం వ్యక్తం చేశారు .
కేసిఆర్ హయాంలో చేసిన అప్పులు, వడ్డీ తీర్చడానికి ఇంకో 12 సంవత్సరాల సమయం పడుతుందని, ఏ తప్పు చేయని తదుపరి ప్రభుత్వాలు ఆ ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది అని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు తీరేంతవరకు ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయకుండా ఆంక్షలు విధించాలని, రాజకీయ పార్టీగా గుర్తింపును రద్దు చేయాలని మంగళవారం రాసిన లేఖలో పేర్కొన్నారు.