ముగిసిన ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ టూర్

-

ముఖ్యమంత్రి  రేవంత్ ఢిల్లీ పర్యటన ముగిసింది. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో  రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఎన్నికల్లో వ్యూహాలు, 6 గ్యారంటీల అమలుపై చర్చించారు. ఇటు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని సైతం సీఎం రేవంత్ కలిశారు. హైదరాబాద్- విజయవాడ, హైదరాబాద్ – కల్వకుర్తి 4 లైన్ల రహదారికి అనుమతులివ్వాలని కోరారు.

సౌత్ రీజినల్ రింగ్ రోడ్పై ప్రతిపాదనలు పంపాలని గడ్కరీ సూచించారు.ఇప్పటికే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం నిధుల వేటలో  భాగంగా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ అంశాలు పరిష్కరించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను సీఎం రేవంత్ కోరినట్లు తెలుస్తోంది.వెనుకబడిన జిల్లాలకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ లో ఉన్న సుమారు 1400 కోట్లు  విడుదల చేయాలని నిర్మలా సీతారామన్ ను రేవంత్ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news